దళిత బంధు అమల్లో రాజకీయం తగదు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

Published: Tuesday April 04, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)
 పార్టీలకు అతీతంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలే తప్ప  రాజకీయం తగదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే   ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. 
దళిత బంధు అమల్లో రాజకీయం తగదు అని దళిత బంధు పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి అందివ్వాలని కోరుతూ ఉప్పల్ రింగ్ రోడ్లో బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ 24 గంటల దర్నాకు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలదండవేసి ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ 
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తు రాజ్యాంగ బద్దంగా పరిపాలిస్థానని ఎటువంటి అశ్రిత పక్షపాతానికి తావివ్వకుండా పరిపాలన కొనసాగిస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఈరోజు లభ్దిదారులను ఎంపికచేయడంలో పూర్తిగా రాజకీయ కోణంలో ఎంపికచేస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తూ అసలైన నిరుపేద చేతి వృత్తుల మీద ఆధారపడే దళితులకు మాత్రం ఈ పధకం అమలు చేయకుండా మోసం చేయడాన్ని ప్రభాకర్ తప్పు పట్టారు.
ఒకవైపున హైకోర్టు దళిత బంధు లభ్దిదారుల ఎంపికలో  ఎమ్మెల్యేల పాత్ర ఉండకూడదు అని నేరుగా సూటిగా చెప్పినప్పటికి కూడా పాలనను మొత్తం రాజకీయమయం చేసి ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వ్యక్తులకే ఇస్తూ దళితబందు యొక్క స్పూర్తిని పూర్తిగా దెబ్బలు తీయటమే కాకుండా దళిత  బంధు లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకోవటం ,లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే దళితబందు వచ్చేలా పేర్లు సిఫార్సు చేయటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు బండారు శ్రీవాణి వెంకట్రావు, కక్కిరేణి చైతన్య హరీష్,      బిజెపి సీనియర్ నాయకులు మహంకాళి లక్ష్మణ్, బాలచందర్, రావుల బాలకృష్ణ, ఎం సతీష్ కుమార్,    కక్కిరేణి హరీష్, బండారు వెంకట్రావు,  రెడ్డి గారి దేవేందర్ రెడ్డి, రేవల్లి రాజు, భరత్ రెడ్డి,  మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసురి యాదగిరి, మేడ్చల్ అర్బన్ జిల్లా  బిజెపి అధికార ప్రతినిధి సింగారం కార్తిక్,
ఉప్పల్ అసెంబ్లీ బిజెపి దళిత మోర్చా కన్వీనర్ తాళ్ళపాలి లింగం,
మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి దళిత మోర్చా కార్యదర్శి శామీర్పేట చంద్రయ్య,
ఉప్పల్ డివిజన్ బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు దువ్వల రమేష్, బిజెపి సీనియర్ నాయకులు
మీసాల జంగయ్య,ఉప్పల్ డివిజన్ బిజెపి మహిళ మోర్చా అధ్యక్షురాలు జ్యోతి,చిలుకానగర్ డివిజన్ బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు దాసరి యాదగిరి,చిలుకానగర్ డివిజన్ బిజెపి యువ మోర్చా అధ్యక్షులు డప్పు దత్త సాయి,ఉప్పల్ అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు గుండె పునెందర్,
అరుంధతి యువజన సంఘం కార్యదర్శి మేకల కృష్ణ  పాల్గొన్నారు.