ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 18ప్రజాపాలన ప్రతినిధి * క్యాబ్ డ్రైవర్లను అసంఘటిత కార్మికులుగా గ

Published: Monday December 19, 2022

కోటి హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని ఎఐటియుసి అనుబంధ సంస్థ తెలంగాణ డైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దూపం అంజనేయులు కోరారు. బీసీ భవనం రెండవ ఫ్లోర్ హనుమాన్ టేక్రి కోటిలో ఎఐటియుసి అనుబంధ సంస్థ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెపల్లి జగన్మోహన్ రెడ్డి, ఎఐటియుసి అనుబంధ సంస్థ తెలంగాణ డైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దూపం అంజనేయులు హాజరై మాట్లాడారు. క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ సమావేశంలో ఉత్తమ డైవర్లుగా సేవా భారత 2022 అవార్డు ఆరుగురుని నియమించడం జరిగింది. జనరల్ సెక్రెటరీ చిట్యాల ప్రేమ్ చందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, సలహాదారులు ఈశ్వర్, ఇన్చార్జి రవికుమార్ గుప్తా, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీశైలం, ఇన్చార్జి రాసాని మధు, ఈ ఆరుగురు సేవాభారత్ 2022 వార్డుకు ఎంపికయ్యారు. లక్ష్మీనారాయణ, ప్రేమ్ చందర్ రెడ్డి, ఈశ్వర్, రవికుమార్ గుప్తా, శ్రీశైలం, మధు, మాట్లాడుతూ తమ సేవలు గుర్తించి మాకు మా ఆరుగురిని సేవా భారత్ అవార్డు అందజేసి సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సేవాభారత్ అవార్డు ద్వారా మా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, ఈశ్వర్, శ్రీశైలం, మధు, ఇన్చార్జులు నాగబాబు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.