ఉప్పరిగూడ పల్లె ప్రగతి సమావేశంలో అధ్యయనం సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి

Published: Saturday June 04, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం  మండలం ఉప్పరి గూడ గ్రామపంచాయతీ వద్ద పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లె ప్రగతి ఇంచార్జి ఏ ఈ ప్రణీత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ తమతమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పరిసరాలను గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లను ఉపయోగించాలని ఆరుబయట మలవిసర్జన చేయరాదని, తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరుగా చెత్త బుట్టలో వేయాలని, అలాగే గ్రామంలో ప్రతి ఇంటిని ఇంటితో పాటు గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చాలని దీనికి గ్రామ ప్రజలందరూ కృషి చేయాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంచినీటి ఫిల్టర్ నిర్వహణా దారునికి 5వేల రూపాయలు నెలసరి వేతనం గా ఇవ్వడం జరిగింది. దీనితోపాటు నెలకు సరిపడా ఫిల్టర్ కి కావాల్సిన పరికరాలు అందజేయడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రిషిక నేత, ఉపసర్పంచ్ బూడిద నరసింహారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.