వాహనాల దగ్ధం కేసులో నిందితులను పట్టుకుంటాం.

Published: Wednesday April 06, 2022
మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్
బెల్లంపల్లి, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న జర్నలిస్టు బద్రి వెంకటేష్ కు చెందిన (స్విప్ట్ డిజైర్ కారు,హోండా లివో బైకు) రెండు వాహనాలను దగ్ధం చేసిన కేసులో నిందితులను పట్టుకోవడానికి ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ పూర్తిస్థాయిలో పలువురిని విచారిస్తునట్లు డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం పట్టణంలో" పీస్ "కమిటీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన ఆయన సమావేశ అనంతరం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు, జర్నలిస్టు వాహనాలను దగ్ధం చేసిన కేసు దర్యాప్తు, వివరాలు ఆయన వెల్లడించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, త్వరలోనే వాహనాల దగ్ధం కేసులో పాల్గొన్న నిందితులను పట్టుకుంటామని, వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని, అలాంటి వారందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేయడమే, కాకుండా అవసరమైతే పీడీ యాక్ట్ లు కూడా, పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కేసు విచారణ, పురోగతిలో ఉన్న దృష్ట్యా, వారి వివరాలను ఇప్పుడే వివరించలేమని, త్వరలోనే నిందితుల పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐలు ముస్కెరాజు, బాబురావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కేసు పురోగతి సాధించడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ ను, వన్ టౌన్ సిఐ, ముస్కే రాజును, కానిస్టేబుల్ లు సంపత్, మల్లేష్, రవి, శ్రీనివాస్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.