భారతీయ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మలబార్

Published: Sunday October 10, 2021
అమీర్ పేట్ జోన్(ప్రజాపాలన ప్రతినిధి) : ప్రముఖ వజ్ర ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ ఇటీవల దుబాయ్ లో జరిగిన వరల్డ్ ఎక్స్ పో 2020లో భారతీయ ఆభరణాల కళానైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అని సంస్థ చైర్మన్ ఎం పీ అహ్మద్ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా శనివారం సోమాజిగూడ స్టోర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్టోర్ హెడ్ మహమ్మద్ అలీ, మహమ్మద్ షరీజ్ లు మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతి, సృజనాత్మకత లకు దుబాయ్ కేంద్రబిందువుగా మారిందని అన్నారు. ఎక్స్ పో 2020లో ప్రపంచ దేశాలన్నీ తమ కళలు, సంస్కృతి, వాణిజ్యం, సాంకేతిక పురోగతిని అత్యుత్తమంగా ప్రదర్శించడంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు అవసరమైన నిర్దిష్ట ఆభరణాలను అందించడంలో మలబార్ గోల్డ్ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుందని తెలిపారు.