పంజాబ్ పధ్దతిలో పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో పునరుద్దరించాలి

Published: Monday November 21, 2022
సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్
జన్నారం, నవంబర్ 20, ప్రజాపాలన: పంజాబ్ పధ్దతిలాగానే తెలంగాణ రాష్ట్రం సీపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని సీపీఎస్ ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ డిమండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంజాబ్  రాష్ర్ట ప్రభుత్వం 2004 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు అమలు పరుస్తున్నా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)ను రద్దు పరుస్తూ తిరిగి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నిర్ణయం తీసుకున్నారని ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణలో 2 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ కోసం ఎదురుచూస్తున్నారని  సీపీఎస్ అంశం రాష్ర్ట పరిధిలోనే ఉందని పంజాబ్ వల్ల రుజువైందని సీపీఎస్ రద్దు కోసం త్వరలోనే ఉధ్యమ కార్యచరణను రూపొందిస్తామనిన్నారు. ఈ సమావేశంలో  సంఘం నాయకులు రమేష్, షఫీక్, సురేష్, కాంతయ్య, నాగన్న తదితరులు పాల్గొన్నారు.