ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 16ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday December 17, 2022

*తెలంగాణ రాష్ట్ర మూడోవా మహాసభలు  జయప్రదం చేయండి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దయ్యాల గణేష్*

ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా పట్టణ కేంద్రంలో ఈనెల 29 30 31 తేదీలలో జరుగుతున్నాయి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు  29వ తేదీన జరిగే భారీ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్  పాల్గొని ప్రసంగిస్తారు, ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని 600 రూపాయలు కూలి ఇవ్వాలని ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్నా భూములకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు తిండి బట్ట విద్య వైద్యం సాగుభూమి కనీస వేతనం లాంటి కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు కాబట్టి ఈ సమస్యలన్నింటిపైన వ్యవసాయ కార్మికుల స్థితిగతుల పైన చర్చించి భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేస్తారు కాబట్టి ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల నుండి వ్యవసాయ కార్మికులు ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు రావాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కాకి రమేష్ , సహాయ కార్యదర్శి పంది  జంగయ్య, ఏ. సరిత , టి యాదగిరి టి  పాల్గొన్నారు,