సర్పంచ్ అలేఖ్య అధ్వర్యంలో మహిళా దినోత్సవం

Published: Thursday March 09, 2023
తల్లాడ, మార్చి 8 (ప్రజాపాలన న్యూస్): 
మండల పరిధిలోని కేశవాపురం గ్రామ సర్పంచ్ 
వనిగండ్ల అలేఖ్య అశోక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి మండల పంచాయతీ అధికారి శ్రీదేవి హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో 100 సంవత్సరాల పూర్తి చేసుకున్న కట్టా లక్ష్మీదేవిని ఎంపిఓ శ్రీదేవి,గ్రామ సర్పంచ్ అలేఖ్య శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న మహిళలను, ఆశ వర్కర్లను,అంగన్వాడీ టీచర్ ను,పంచాయతీ మహిళా వార్డు మెంబర్లను శాలువలతో ఘనంగా సత్కరించారు.అనంతరం సర్పంచ్ అలేఖ్య మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని,మహిళలు వంట ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో ఒక ఉన్నత స్థానంలో గౌరవించబడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచి అలేఖ్య అశోక్, ఆశా వర్కర్ రజిత, అంగన్వాడి సిబ్బంది గంగమ్మ, వార్డు మెంబర్లు చిన్నంశెట్టి పద్మ, సాధం నాగమణి, పారుపల్లి అరుణ పాల్గొన్నారు.