యుటిఎఫ్ ఆంజనేయులు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు యుటిఎఫ్ మధిర శాఖ

Published: Monday March 01, 2021
మధిర ఫిబ్రవరి 28 ప్రజా పాలన వారు మాట్లాడుతూ సేనాని, అతనో చైతన్యం, అతనో ఉషా కిరణం, నిప్పు కణం, త్యాగానికి రూపం, సేవాభావానికి ప్రతిరూపం, శత్రువులను చిత్తు చేయడంలో నేర్పరి, సంఘ ఉన్నతిలో అతనిదో ప్రత్యేక స్థానం, సమన్వయానికి చిరునామా, సమస్యా పరిష్కారంలో దిట్ట, మధిర ప్రాంత ఉపాధ్యాయుల ఇంటి మనిషి, స్నేహశీలి, ఆత్మ బంధువు ఆయనే తాళ్లూరి ఆంజనేయులు. ది:20.02.1963 మోటమర్రి గ్రామంలో తాళ్లూరు శేషయ్య బసవమ్మ గార్లకు నాల్గవ సంతానంగా జన్మించి ది:28.01.1984న ప్రాథమిక పాఠశాల మామునూరు, ఎర్రుపాలెం మండలం నుండి  ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి మోతుగూడెం కేంద్రంగా చింతూరు మండలం నుండి  పుష్కర కాలం పాటు ఉపాధ్యాయ ఉద్యమంలో రాటుదేలి సొంత ప్రాంతం మధిర డివిజన్ నుండి రెండు దశాబ్దాల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యమ రథసారథి గా, మహిళా ఉపాధ్యాయులకు సంఘం ఇచ్చిన సోదరుడిగా, విలువలు సామాజిక స్పృహను నిత్యం విద్యార్థులకు పాఠాలుగా బోధించే ఉత్తమ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునిగా, విలువైన సేవలందించి ప్రాథమికోన్నత పాఠశాల, రాయపట్నం ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న తాళ్లూరి ఆంజనేయులుకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అనుక్షణం పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ నిత్య చైతన్యంతో చొరవతో సమస్య పరిష్కారంలో ముందుంటూ ఉపాధ్యాయులందరికీ తలలో నాలుకలా ఉంటూ త్యాగనిరతి తో, సేవాగుణం తో, నిగర్వి గా, నిరాడంబరత తో యుటిఎఫ్ సంఘాన్నే తన ఇంటి పేరుగా మార్చుకొని అందరి నోళ్లలో UTF ఆంజనేయులు గా ఉపాధ్యాయుల ఇంటి మనిషిలా, అందరితో మమేకమై కలిసి గడిపిన ఈ కాలం మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఈ జ్ఞాపకాలు ఉపాధ్యాయ రంగానికే పరిమితం కాక  మీ లక్ష్యమైన సమసమాజ సాధనకై భావి జీవితం కొనసాగాలని కోరుకుంటూ..