కరొనా తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

Published: Saturday April 24, 2021

గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
పరిగి, ఏప్రిల్ 23, ప్రజాపాలన ప్రతినిధి : యావత్ ప్రపంచంలోనే  కరొనా సమయం లో మనకు ఎక్కడ ఏమీ జరిగిన వెంటనే సమాచారం అందిస్తున్న జర్నలిస్టులు తాము బయటకు వెళ్ళడం ప్రమాదం అని తెలిసినకుడా మనకోసం సమాజం కోసం నిరంతరం సేవలు అంధిస్తున్నారు.... ప్రజలకు ప్రభుత్వానికి వారధి గా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారం కావాడానికి ముఖ్య పాత్ర వహిస్థున్నరు. కనుక కరొనా తో జర్నలిస్టు చనిపొతె వారి కుటుంబాలను ఆదుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి ప్రభుత్వం ఆసరాగ ఉంటూ వారికి, ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎలా అయితే 25 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నారో అదేవిధంగా జర్నలిస్టులకు కూడా 25 కిలోల రేషన్ బియ్యం తో పాటుగా వాళ్లను అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని మరియు కరోనా మహమ్మారి గురించి ఎక్కడ ఏం జరిగినా మనకు తెలిసేలా చేసేది  ఒక జర్నలిస్టు మాత్రమే కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్రప్రభుత్వం కావచ్చు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు ఆదుకున్నప్పుడు ప్రజల కోసం సమాజం కోసం ఎల్లవేళలా పని చేస్తున్నా జర్నలిస్టుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి అలాగే కరోన బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఆర్థిక సహాయం అందించి వారికి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు.. ఒక జర్నలిస్టు లేకపోతే ప్రపంచం మొత్తం అంధకారంలోనే ఉంటుందని ఆయన అన్నారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని లేనియెడల కరోనా సమయంలోనే 144 సెక్షన్ పెట్టిన ఎలాంటి షరతులు విధించిన జర్నలిస్టులతో కలిసి గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.