ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ అమరయ్య

Published: Saturday April 15, 2023
బోనకల్, ఏప్రిల్ 14 ప్రజాపాలన ప్రతినిధి
:ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ అమరయ్య అన్నారు. మండలంలోని కలకోట బస్టాండ్ ఆవరణములో శుక్రవారం యూత్ అధ్యక్షులు మాతంగి నరేంద్ర అధ్యక్షతన అంబేత్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటుచేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ లు అమలు చేసి బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఆదుకోవాలన్నారు. అన్ని రంగాలు ఒకే సామాజిక వర్గాల చేతిలో ఉండటం ప్రజాసౌమ్యానికి మంచిది కాదన్నారు.అన్ని రంగాలలో పేద నిరుపేద వర్గాలకు ప్రధాన్యత నివ్వా లన్నారు, ప్రధానోపాధ్యాయులు దామాల పుల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ అనేక మంత్రి పదవులు అనుభవించి భారతదేశానికి దిశా నిర్దేశం చేసిన వారిలో ప్రథముడు అన్నారు ,ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు భవిష్యత్ తీర్చి దిద్దుకోవలన్నారు,చరిత్ర అధ్యాపకులు బండి ప్రసాద్ మాట్లాడుతూ కొంతమంది కుట్రలు కారణంగా ఆ మహనీయుని మనం కోల్పోయామన్నారు, సర్పంచ్ యంగల దయామణి మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వంతో మనగలుగుతున్నామంటే రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు, ఆంగ్ల అధ్యాపకులు సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రపంచ రాజ్యాంగాలను చదివి భారతదేశ ప్రజలకు ఏ రకమైన హక్కులు కల్పించబడాలో ఆయన పొందుపరిచారన్నారు, రసాయన శాస్త్ర లెక్చరర్ బండి సుధాకర్ మాట్లాడుతూ నిరుపేదలైన యువకులు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా చదివి ఉన్నత స్థానాలు అధిరోహించాలన్నారు, మాజీ సర్పంచ్ సాల్మన్ మాట్లాడుతూ ఆయన రాజకీయాలకతీతంగా రాజ్యాంగంను రూపొందించారన్నారు, పాస్టర్ సుంకర ఏసుబాబు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు, కార్యక్రమంలో సెక్రెటరీ లక్ష్మి తోటపల్లి కోటి, బందెల ముత్తయ్య, తోటపల్లి వెంకటేశ్వర్లు, తోటపల్లి రాజశేఖర్, మాతంగి శ్రీను,మేకల అంజి, బరుగుల రాజేష్,వార్డు మెంబర్ బరుగుల రత్తమ్మ, అంగన్వాడీలు ప్రసాద్ భాయి, యాకూబి,నాగమణి, గ్రామ దీపికలు రాణి ,నందిని, యూత్ సభ్యులు శంకర్, నరేందర్, కిరణ్,ఆకాష్, కౌషిక్, రాజేష్, రవీంద్ర, సురేష్, తరుణ్, అఖిల్, అశోక్, భరత్, శరత్, ప్రవీణ్ తదితరుల పాల్గోన్నారు అనంతరం యూత్ గ్రామంలో బైక్ ర్యాలీ తీసి అంబేత్కర్ కు ఘన నివాళులు అర్పించారు.