బోనకల్ మండల బిజెపి నేతల అక్రమ అరెస్ట్

Published: Wednesday November 17, 2021
బోనకల్, నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఐకెపి కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై దాడి చేసిన టిఆర్ఎస్ దుండగులు దాడికి నిరసనగా ఖండిస్తూ సూర్యాపేట బయలుదేరుతున్న బోనకల్ మండల బిజెపి నాయకులను బోనకల్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినారు. అరెస్ట్ అయినవారిలో బోనకల్ మండల బీజేపీ అధ్యక్షులు వీరపనేని అప్పారావు, మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరరావు, బీజేవైఎం మండల అధ్యక్షులు కాలసాని పరుశురాము, జిల్లా ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్, మండల ఓబిసి ఉపాధ్యక్షులు మరీదు పరశురాముడు పాల్గొన్నారు