గౌడ కులస్తుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు నర్సాగౌడ్

Published: Monday November 07, 2022
జన్నారం,నవంబర్ 06, ప్రజాపాలన: గౌడ కులస్తుల హక్కుల సాధన కోరకు ప్రభుత్వం పై నిరంతర పోరాటం చేస్తామని తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి(మోకుదెబ్బ) జాతీయ అధ్యక్షులు  అమరవేని నర్సాగౌడ్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో  తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి రెండవ మహసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హజరైన ఆయన గౌడ కులస్తులను ద్దేశించి ప్రసంగించారు. ఎన్నో ఎళ్ల నుండి గౌడ కులస్తుల హక్కులు,ఆత్మ గౌరవం కోసం తమ సంఘం పోరాటం చేస్తుందని, ఎజేన్సీలో గీత కార్మికులకు  లైసన్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి లైసన్సు ఇప్పించేందుకు తమ సంఘం అధ్వర్యంలో ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని అన్నారు. మోకుదెబ్బ ఎ రాజకీయ పార్టీకి తొత్తుగా  ఉండదని గౌడ జాతి అభ్యున్నతి కోరకే పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోకు దెబ్బ  రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కేసరి అంజనేయులుగౌడ్ , రాష్ట్ర కార్యదర్శి మోండిగౌడ్,రాష్ర్ట అధికార ప్రతినిధి బాలసాని నారయణగౌడ్, రాష్ట్ర నాయకులు  రంగు శ్రీనివాస్ గౌడ్,రమేష్ చందర్ గౌడ్,జిల్లా అధ్యక్షులు  బాలసాని శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు  వొల్లాల నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా
జన్నారం మండల తెలంగాణ జనహక్కుల పోరాట సమితి(మోకుదెబ్బ) కు నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ ప్రకటించారు. ఈ కార్యవర్గం లో మండల గౌరవ అధ్యక్షుడు బట్టల నర్సగౌడ్, మండల అధ్యక్షుడు బట్టల లచ్చాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూసనవేని గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శంకర్ గౌడ్, ఎనుగంటి రాజాగౌడ్, శ్రీనివాస్ గౌడ్,అంజగౌడ్, మోహన్ గౌడ్,ప్రధాన కార్యదర్శి పొడేటి శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శులు కాసారపు సత్యగౌడ్, వెంకన్నగౌడ్, చంద్రగౌడ్, శంకర్ గౌడ్, కనకయ్యగౌడ్, కోషాధికారి కోట రవిగౌడ్ , ప్రచార కార్యదర్శులు పుల్ల శ్రీనివాస్ గౌడ్, రవిగౌడ్, ముఖ్య సలహదారులు కైరం భీమగౌడ్, వొల్లాల నర్సాగౌడ్, నెరెళ్ల శ్రీనివాస్ గౌడ్ లు ఎకగ్రీవంగా ఎన్నికైయ్యారు.