ప్రజలందరికీ కరోనా కట్టడికి ఆవగాహన రావాలని అంబేద్కర్ విగ్రహానికి మాస్క్

Published: Monday May 17, 2021
బాలపూర్, మే 16, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని దళిత సంక్షేమ సమితి పేర్కొన్నారు. బాలపూర్ మండలం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని దళిత సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జిల్లెల గూడ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాస్కు పెట్టడం వల్ల ప్రజలకు కరోనా మహమ్మారి వైరస్ నివారణ పై అవగాహన వస్తుందని భావనతో ఆదివారంనాడు దళిత సంక్షేమ సమితి సభ్యులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి మాస్క్ పెట్టారు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కరోనా కట్టడి చేయాలంటే మాస్కులు ధరించాలిని, భౌతిక దూరం పాటించినట్లైతే కరోనా ను కట్టడి చేయవచ్చని, ప్రతి ఒక్కరికి భావన కలిగేటట్లు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాస్క్ తో ప్రజలు మేల్కొంటారు అని చెప్పారు. ఈ సందర్భంగా డి ఎస్ ఎస్ అధ్యక్షులు బైగళ్ళ ఓం ప్రకాష్ మాట్లాడుతూ.... మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్పోరేషన్ లో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల సుందరీకరణ ఏర్పాటకు 5 లక్షల రూపాయల కేటాయించినందుకు దళిత సంక్షేమ సమితి వారందరూ ధన్యవాదాలు తెలియజేశారు. సుందరీకరణ భాగంలో లైటింగ్ మరికొన్ని చిన్న మరమ్మత్తులు పనులు జరగాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు ఆవుల జనార్ధన్, ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మాధురి శ్రీనివాస్, జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జలగం జంగయ్య, సాయి కృష్ణ, కమిటీ సభ్యులందరూ, తదితరులు పాల్గొన్నారు.