ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.. జనశిక్షణ డైరెక్టర్ రాధాకృష్ణ..

Published: Friday July 29, 2022
తల్లాడ, జులై 28 (ప్రజాపాలన న్యూస్):
సానిటరీ నాప్కిన్స్ పాడ్స్ ఉపయోగించే పద్ధతులను ప్రాముఖ్యత ను తెలిపిన జె యస్ యస్ ఖమ్మం జిల్లా రిసోర్స్ పర్సన్స్ జాస్మిన్, రజియా.
జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో గురువారం తల్లాడ మండలంలోని  పినపాక, రేజర్ల, మిట్టపల్లి  గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగాజె యస్ యస్ సెంటర్స్ లలో సానిటరీ నాప్కిన్స్, పాడ్స్ ఉపయోగం, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినారు. లబ్ధిదారులకు సానిటరీ పాడ్స్ పై అవగాహన కల్పించి పాడ్స్ అందించారు.ఈ సందర్బంగా ప్రజలందరు విధిగాఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు పాటించాలని,  పరిశుభ్రంగా ఉండేటట్లు చుచుకోవాలని, ఆర్థికంగా మహిళలుఅభివృద్ధి చేద్దాలని, ఉచితంగా అందిస్తున్న స్వయం ఉపాధి శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని జె యస్ యస్ డైరెక్టర్ సూచించారు.  ఈ కార్యక్రమం లో జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రి గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ పెద్దలు పాల్గొన్నారు.