తెరాస, భాజపా పార్టీలకు ఓట్లు అడిగే హక్కే లేదు

Published: Friday March 05, 2021
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చిన్నారెడ్డిని గెలిపిద్దాం - మాజీ ఎంపీ కొండా విశ్వరెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోవడానికి తెరాస పార్టీయే కారణమని, తెరాస, భాజపా పార్టీలకు ఓట్లు అడిగే హక్కే లేదని, చదువుకున్న యువకులు ఆలోచించి చిన్నా రెడ్డిని గెలిపించాలని కాంగ్రేస్ సీనియర్ నాయకులు, చేవెళ్ల మాజి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. ఈ నెల 14 న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నాడు జరిగిన సన్నాహక సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎస్ ఎన్ గార్డెన్స్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గo ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చేవెళ్ల మాజి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న రెడ్డి, మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్, జిల్లా కో ఆర్డినేటర్ మన్నే సతీష్, రఘునందన్ హాజరయ్యారు. శేరిలింగంపల్లి నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నా రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ బృతి కింద ఇవ్వవలసిన 74000 వేలను వెంటనే ఇవ్వాలని కేసిఆర్ కు సవాలు చేస్తున్నానన్నారు. రాబోయే మూడు నెలలలో నిరుద్యోగ భృతి ఇవ్వక పోతే ప్రగతి భవన్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. మన్నే సతీష్  మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్ ఓటర్లు 24వేల మంది ఉన్నారనీ కాంగ్రేస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరినీ కలిసి చిన్నారెడ్డి గెలుపుకు కృషి చేయాలన్నారు. 43 సంత్సరాల అనుభవం ఉన్న చిన్నా రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే గొంతుకగా చేద్దామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో అందరు కలిసిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు నిజామోద్దీన్, కాంటెస్టెడ్ కాంగ్రేస్ కార్పొరేటర్లు రేణుక, మహిపాల్ యాదవ్, నగేష్, భారత్ గౌడ్, సీనియర్ నాయకుడు నిజామోద్దీన్, రాజన్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.