ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Published: Tuesday September 06, 2022
కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రధానోత్సవం
 
 
బోనకల్ ,సెప్టెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు సోమవారం జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ న్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలను, గొప్పతనాన్ని గురించి, సమాజంలో గురువులకు ఉన్న ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు గురువుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండి ఉన్నత చదువులు చదువుకుని గొప్పవాళ్లు కావాలని ఆ కాంక్షించారు. అనంతరం కళాశాలలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రిన్సిపల్, లైబ్రేరియన్ నక్కా ప్రసాద్ బాబు లు బహుమతులను అందించారు. కళాశాల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు సెకండ్ ఇయర్ లో అత్యధిక మార్కులు సాధించిన పండగ పూజితకు 5000/- నగదు బహుమతిని అందించడం జరిగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పివో వున్నం రామకృష్ణ, అధ్యాపకులు, ప్రభుత్వ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.