సీసీరోడ్డుకు జడ్పీటీసీ దిరిశాల ప్రమీల శంకుస్థాపన..

Published: Thursday March 30, 2023
తల్లాడ, మార్చి 29 (ప్రజాపాలన న్యూస్):
 *తల్లాడ మండలంలోని ముద్దునూరు గ్రామపంచాయతీలో  10 లక్షల సీసీరోడ్డుకు తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సహకారంతో గ్రామంలో 10 లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రామాల్లో సిసిరోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మట్టిరోడ్లను సిసిరోడ్లుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ అశోక్, బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కట్టమూడి శ్రీనివాసరావు, నాయకులు ఇనపనూరి అంబేద్కర్, బుజ్జి, జానీ, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.*