వనపర్తి లో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం

Published: Tuesday November 23, 2021
హైదరాబాద్ 21 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి: వనపర్తి జిల్లా లో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆదివారం నాడు వనపర్తి జిల్లాలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు రంజిత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హాజరయ్యారు. చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ నెల 5 నుంచి 14 వరకు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిర్వహించే రిలే నిరాహార దీక్షలు నిర్వహించ బడుతున్నాయని వెల్లడించారు. దీనికి సంబంధించి 'హలో మాల- చలో ఢిల్లీ' అనే కరపత్రం ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల లోని మాల మరియు మాల ఉపకులాల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది చంద్రశేఖర్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. బాలస్వామి, మధుసూదన్, జావేద్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు.