రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ లో కలిసి వినతిపత్రం అందించారు

Published: Wednesday June 15, 2022

  ఇబ్రహీంపట్నం జూన్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి  

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపు లో భాగంగా ఈ రోజు యాచారం రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో యాచారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి B. మధుసూదన్ రెడ్డి  హాజరై మాట్లాడుతూ వానకాల సీజన్ ప్రారంభం అవుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచలేదన్నారు పైగా రోజుకోచోట నకిలీ విత్తనాలు బయట పడుతున్నాయి వాటి పై కఠిన చర్యలు తీసుకోవాలి. మరియు రుణ మాఫీ చేస్తామని ఇప్పటికి చెయ్యలేదు కనుక తక్షణమే రుణ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చెయ్యాలి. మండలం లోని కౌలు రైతులను ఆదుకోవాలని వీరికి రైతు బీమా గాని, రైతు బంధు గాని, రైతు రుణమాఫీ గాని వీరికి వర్తింప చెయ్యాలి. పైగా కౌలు రేటు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇతర పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి ఈ ఫలితంగా అనేక మంది కౌలురైతులు ఆత్మ హత్య లు చేసుకుంటున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు లకు స్కింలన్నీ వర్తింపచెయ్యాలి. ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని.పోల్ట్రీరైతులను ఆదుకోవాలని. పాడిరైతు లను ఆడుకోవాలని వానాకాలం సీజన్ లో పశువులకుగాని, గొర్రెలు, మేకలకు గాని సరియైన సమయానికి మందులు గాని టీకా గాని వేయాలని ఇంకా అనేక సమస్యలను గుర్తించి వాన కాల సమయంలో అన్నీ అందుబాటులో ఉంచాలని యాచారం రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఉంచని యెడల పెద్ద ఎత్తున మరో ఉద్యమం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాచారం రైతు సంఘం మండల కార్యదర్శి ఎంపీ నరసింహ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సత్యం ధర్మన్నగూడ సర్పంచ్ భాష య్య భాశయ్యా రైతు సంఘం నాయకులు లిక్కి మధుకర్ రెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు