ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 20ప్రజాపాలన ప్రతినిధి *తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల స్కాలర్ షిప్స

Published: Saturday January 21, 2023
బిజెవైఎం  రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టి.యాదష్  అద్యక్షతన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కేంద్రంలో బిజెవైఎం ఆధ్వర్యంలో 500 మంది యువకులలో స్కాలర్షిప్  ఫీజు రీయంబర్స్మెంట్ నియమాల ప్రకారం విడుదల చేయాలని రాస్తారో నిర్వహించడం జరిగింది. బానుప్రకాష్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మొత్తం విద్యార్థులను అణిచివేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయలేని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు. అర్జున్ రెడ్డి , దయానంద్ గౌడ్ , ప్రతాప్, యాదీష్  మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడడం మంచిది కాదని అన్నారు. ఇబ్రహీంపట్నం  చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేసినవారిని అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలిస్ స్టేషన్ కి తరలించారు. పలువురి నాయకులను గాయాలు అయ్యాయి.ఈ కార్యక్రమంలో బిజెపి  రాష్ట్ర నాయకులు ప్రతాప్, దయానంద్ గౌడ్, పోరెడ్డి అర్జున్ రెడ్డి, కొత్త అశోక్ గౌడ్,సత్యనారాయణ, బిజెవైఎం  రాష్ట్ర నాయకులు మహేందర్, నోముల కార్తిక్ గౌడ్, పొట్టి రాములు,బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదరి పగడాల శ్రీశైలం, శాంతకుమార్, ప్రేమసాయి, అశోక్, మండల అద్యక్షులు శ్రీశైలం, మున్సిపాలీటి అధ్యక్షులు నర్సింహరెడ్డి,  నాయకులు వరుణ్,రూపర్, అమార్ నాథ్ రెడ్డి, శివ, మహేష్ చారి, శేఖర్ రెడ్డి, మహేందర్, శ్రీకాంత్ అసెంబ్లీలోని మండల అధ్యక్షులు రాజు, నర్సింహ్మరెడ్డి, శ్రీకాంత్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.