13వ వార్షిక బ్రహ్మోత్సవాలు

Published: Tuesday June 22, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం హోమం నిర్వహించి, స్వామివారి కల్యాణం మహోత్సవాన్ని డింగిరి శేషా చార్యులు, ఫణికుమార చార్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ అనంతరం భక్తులు స్వామి వారికి తలంబ్రాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి, బ్రహ్మచారి, కందాటి సోమిరెడ్డి, తుమ్మల ధర్మారెడ్డి, కొంతo శ్రీనివాస్, ఏనుగు రాంరెడ్డి, ధర్మకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.