లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన గిరి ప్రసాద్ నేటి తరం కమ్యూనిస్టులకు గిరి ప్రసాద్ ఆదర్శ

Published: Wednesday May 25, 2022
మధిర రూరల్ మే 24 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో భారత కమ్యూనిస్టు పార్టీ cpi జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మధిర ప్రాంతవాసి అమరజీవి కామ్రేడ్ *నల్లమల గిరి ప్రసాద్ * 25 వ వర్ధంతి సందర్భంగా గిరి ప్రసాద్ గారి సొంత గ్రామమైన మధిర మండలం తొండల గోపారం లో సిపిఐ మధిర మండలం సమితి ఆధ్వర్యంలో గిరి ప్రసాద్  వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా గిరి ప్రసాద్  స్మారక స్థూపం వద్ద *సిపిఐ మధిర మండల సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ* జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా గిరి ప్రసాద్  స్మారకస్థూపం కి *సిపిఐ మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవి బాబు * పూలమాల వేసి నివాళులర్పించారు. గిరి ప్రసాద్  విగ్రహానికి *సిపిఐ మండల కార్యదర్శి ఓట్ల కొండలరావు  పట్టణ సహాయ కార్యదర్శి పెరుమలపల్లి ప్రకాశరావు* పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం *సిపిఐ మధిర  పట్టణ మండల కార్యదర్శి లు  బెజవాడ రవి బాబు  ఓట్ల కొండలరావు * మాట్లాడుతూ 
అప్పటి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ దృవతారగా వెలుగొందిన గిరిప్రసాద్ జీవితం, ఆయన చేసిన త్యాగం నేటి తరం కార్యకర్తలకు, నాయకులకు స్పూర్తిదాయకమని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలను నడిపించడంలో కీలకపాత్ర పోషించిన గిరిప్రసాద్ లేని లోటును పరిపూర్తి చేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేఖంగా ఆంధ్ర మహాసభ సాగించిన ఉద్యమం గురించి అధ్యయనం చేసి ఉన్నత విద్యను, ఆస్తులను సైతం వదిలివేసి ఉద్యమబాట పట్టిన నల్లమల సాయుధ పోరాటాన్ని బలోపేతం చేశాడని కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన గిరిప్రసాద్ జిల్లా అభివృద్ధికి, పేదల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేయాడన్నారు. అయన చూపిన పోరాట మార్గంలో పయనిస్తూ నమ్మిన సిద్ధాంతాలను నెరవేర్చినప్పుడే నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతామని అన్నారుఈ వర్ధంతి కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ ఏఐటీయూసీ మధిర డివిజన్ కార్యదర్శి  చెరుకూరి వెంకటేశ్వరరావు రైతు సంఘం మండల అధ్యక్షులు పంగా శేషగిరిరావు మండల కార్యవర్గ సభ్యులు వుట్ల కామేశ్వరరావు మంగళగిరి రామాంజనేయులు సిరి వేరు శ్రీను sk. కొండ తొండల గోపారం గిరి ప్రసాద్  అభిమానులు సత్యనారాయణ వెంకటేశ్వరరావు కృష్ణయ్య వెంకట్  నారాయణ తదితరులు నివాళులర్పించారు.