డబుల్ బెడ్రూం ఇళ్లలో వికలాంగులకు 5 శాతం కేటాయించాలని

Published: Saturday March 26, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం లింగంపల్లి గేటు దగ్గర సమీపంలో నిర్మిస్తున్న సంక్షేమ పథకాల అన్నింటిలో 5 శాతం కేటాయించాలని.... ఎం పి ఆర్ డి డిమాండ్. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎం పీ ఆర్ డి నేడు మంచాల్ మండలం మంచాల్ గ్రామంలో  వికలాంగుల సమావేశం అశ్వల బాల్ రాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు వికలాంగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 5 శాతం వికలాంగులకు కేటాయించాలని, కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వికలాంగుల అవసరాలను గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పూర్తిగా విఫలం చెందినాయన్నరు. దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 8 సంవత్సరాల నుండి బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లలో నిరుద్యోగ వికలాంగుల 4 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే 120 ఉన్న రోష్టర్ పాయింట్ తగ్గించి 50 లోపు తిసుకురావలని  ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 6.51 లక్షల ఆసరా పెన్షన్ లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగులు స్వయం ఉపాధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా వికలాంగులు రిజర్వేషన్లు కోల్పోతారని తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు . సామూహిక ప్రాంతాల్లో బధిరులు, అంధులకు ఉపయోగపడే విధంగా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినప్పటికీ అమలు చేయడంలో విఫలం చెందినారు విమర్శించారు. మానసిక వికలాంగుల సంరక్షణ కోసం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని, పాలకుల నిర్లక్ష్యం మూలంగా వికలాంగులకు అందని ద్రాక్షగా మారుతుందన్నారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలని, దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం అమలు చేయాలి. ధ్రువీకరణ పత్రాల మంజూరులో ఒక రాష్ట్రం ఒక్కో విధానాన్ని అనుసరిస్తుందని దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అనుసరించాలని, వికలాంగుల సమగ్ర అభివృద్ధి కోసం వికలాంగులకు ప్రత్యేక పాలసీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మార్చి 10 నుండి 31 వరకు సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో వచ్చిన సమస్యలపై ఏప్రిల్ 4న అన్ని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని, 25న కలెక్టరేట్ ముందు మహా ధర్నాల నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గడ్డం పాపిరెడ్డి ప్రదాన కార్యదర్శి చిర దానయ్య ఉపాధ్యక్షులు వింజమూరి మహిపాల్ రెడ్డి బస్సు పాండురంగా రెడ్డి కోనల మల్లష్ వెంకట్ రమణ అవ పాండు చంద్రయ్య గ్యరా యదమ్మ పోచమ్మ బాగ్యమ్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.