గ్రామాభివృద్ధికి దివిస్ సహకారం అభినందనీయం -- చింతలగూడెం సర్పంచ్ ఆవుల రేణుక, దామెర ఎస్ఎంస

Published: Saturday September 24, 2022

చౌటుప్పల్, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): గ్రామాభివృద్ధికి దివిస్ పరిశ్రమ అందిస్తున్న ఆర్థిక సహకారం అభినందనీయమని చింతలగూడెం, సర్పంచ్ ఆవుల రేణుక, దామెర ఎస్ఎంసి చైర్మన్ శేఖర్ రెడ్డి, అన్నారు. చౌటుప్పల్ మండలంలోని చింతలగూడెం - దామేర, గ్రామాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.1,73,000/- రూపాయల విలువ చేసే నోట్ బుక్స్,స్కూల్ బ్యాగ్,వాటర్ బాటిల్స్,షూస్,హార్లిక్స్ ప్యాకెట్లను దివిస్ పరిశ్రమ యాజమాన్యం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని దివిస్ పరిశ్రమ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని పాఠశాలలకు అందిస్తూ,విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె శ్రీలక్ష్మి, బి ఉపేందర్, గ్రామ పెద్దలు నారెడ్డి అభివందన్ రెడ్డి, దివిస్ ఎస్ ఆర్ ఇన్చార్జ్ వల్లూరి వెంకట రాజ్, ఎస్ సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు,