తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్లు శంకరపట్నం నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి:

Published: Friday November 11, 2022

శంకరపట్నం మండల పరిధిలోని అనేక గ్రామాలలో ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆరు కాలం కష్టపడి శ్రమించి పండించిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం రకరకాల పేరుతో దోపిడీ జరుగుతుంది ఈ కేంద్రాల వద్ద తరుగు పేరుతో దోపిడి జరుగుతుంది? అలాగే ధాన్యం శుభ్రం చేసిన తరువాత ఐకెపి సెంటర్ వాళ్లు ఏ గ్రేడ్గా నిర్ణయించినా తర్వాత కూడా హామలిలు వేసే తుకాళ్లలో కిలో ధాన్యాన్ని ఎక్కువ జోకుతూ ఈ మిల్లర్ యాజమాన్యం సహాయంతో దోపిడి జరుగుతుంది కానీ సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేంద్రాల వద్ద పనిచేసే సిబ్బంది మిల్లర్లో యాజమాన్యాలు కుమ్మక్కై ఈ దోపిడీ జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని కేశవపట్నం మార్కెట్ యార్డ్ లో, తాడికల్,అంబాలపూర్,మొలంగుర్,ఇతర గ్రామాలలో జరుగుతున్నాయని రైతులు అంటున్నారు.