రేపటి నుండి కరోనా టెస్టులు మధిర టీవీ ఎం స్కూల్లో, వ్యాక్సినేషన్ ప్రభుత్వ హాస్పిటల్లోజిల్లా

Published: Thursday May 06, 2021
మధిర, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : మదిర మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ ఛాంబర్ లో ఎమ్మార్వో, ఎండిఓ, ఉన్నతాధికారులు,ప్రభుత్వ డాక్టర్లు తో కారొన పై మరియు దాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు తగు సూచనలు ఇవ్వాలని. పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేపించాలని సూచించారు. గ్రామాల్లో కూడా మాస్కులు తప్పనిసరి పెట్టుకోవాలని తెలియజేయాలి అవసరమైతే మాస్కు పెట్టుకోకపోతే ఫైన్ విధించాలి. ప్రభుత్వ హాస్పిటల్లో Covid టెస్టులు వ్యాక్సినేషన్ ఒకేచోట ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో టెస్ట్ చేసే కేంద్రాన్ని రేపటి నుండి TVM స్కూల్ కి మార్చాలి అని తెలియజేశారు, కేటాయించిన TVM స్కూల్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కోవింద్ నిబంధనలు పాటిస్తూ రైతులను అప్రమత్తంగా ఉండేలా తెలియజేయాలని సూచించారు.