ప్రతి స్త్రీలో మాతృమూర్తినీ చూడాలి: మేయర్

Published: Saturday February 20, 2021

బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్: బడంగ్ పేట్ కార్పొరేషన్ లోని  అల్మస్ గూడ లో ఉన్న కోమటికుంట కట్టమీద  శివాజీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు శివాజీ విగ్రహానికి అతిథుల ద్వారా పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ  శోభయాత్రలో పాల్గొన్న బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి. యువతని ఉద్యేశిస్తూ మేయర్ మాట్లాడుతూ.. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమతో ఉండాలని వారికి విద్యాబుద్దులు నేర్పిందని అన్నారు. చిన్ననాటి నుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు అలవర్చుకునేలా, పరాక్రమం, సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి అతనికి నేర్పించిందని కొనియాడారు. శివాజీ పక్క రాజ్యం కోటను స్వాదినం చేసుకున్నప్పుడు నవాబు కోడల్ని తన మాతృ సమానంగా భావించి పల్లకిలో పంపిన ఘనత ఛత్రపతి శివాజీకి దక్కిందని. అలాగే మనం కూడా స్త్రీల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ ప్రతీ స్త్రీలో మాతృమూర్తిని చూడాలని సందేశం ఇచ్చారు. కోమటికుంట చెరువు దగ్గర ఉన్న శివాజీ విగ్రహం అనుగుణంగా చెరువుల సుందరికరణలో భాగంగా అల్మాస్ గూడ చెరువుకు 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే సుందరీకరణ చేయడానికి చక్కటి ప్రణాళికతో చేస్తారని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో  అల్మాస్ గూడా కార్పొరేటర్లు రామిడి మాధురి వీరకర్ణ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, ముత్యాల లలిత  కృష్ణ, శివాజీ యూత్ అధ్యక్షులు గణేష్, శివాజీ యూత్ సభ్యులు, వివేకానంద యూత్ సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ వాసులు తదితరులు పాల్గొన్నారు.