వృద్ధాశ్రమంలో ఘనంగా వంగా లక్ష్మణ్ గౌడ్ జన్మదిన వేడుకలు

Published: Friday August 26, 2022

బోనకల్, ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణు గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ యంగ్ డైనమిక్ లీడర్ యూత్ కి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా అభిమాన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద పోరాడుతూ పార్టీ బలోపేతం గురించి అహర్నిశలు కష్టపడుతూ జనసేన పార్టీ యువజన విభాగాన్ని ముందుకు తీసుకెళ్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, ఏ పార్టీ చేయని విధంగా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ యువజన విభాగాన్ని వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ రాజకీయ నాయకులకు ఒక దమ్మున్న జనసేన పార్టీ యువజన విభాగాన్ని చూపిస్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారని, వారి నాయకత్వంలో మధిర నియోజకవర్గం జన సైనికులు పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా నాయకులు సజ్జనపు భరత్, మండల్ నాయకులు ఎస్కే జానీ పాషా, నరసంశెట్టి నరేష్ ,మోదుగు పవన్, తదితరులు పాల్గొన్నారు.