*తాపీ మేస్త్రీల సమ్మె విరమణ*

Published: Friday January 06, 2023

  మధిర జనవరి 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు తాపీ మేస్త్రిఈనెల జనవరి ఒకటో తారీకు నుండి తాపీ మేస్త్రి సమ్మె చేయటం జరిగింది. కూలీ రేట్లు పెంచాలని ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి సమ్మెకు పిలిపిస్తారు .అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో భాగంగా ఈ రోజున తాపీ మేస్త్రి కి 850 రూపాయలు మరియు కూలి పనివాడికి 600 రూపాయలు ఇచ్చే నిర్ణయం పద్ధతి మీద ఈ రోజున సమ్మె విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తాపీ మేస్త్రి లందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ సంగు సైదులు ను ఎన్నుకోవడం జరిగింది అలాగే సెక్రటరీగా పుల్లూరి రవిని మరియు కోశాధికారిగా బి చంద్రయ్యను ఎన్నుకున్నారు