ఇంటింటి శుభ్రతప్రజలందరి ఆరోగ్యం డాక్టర్ వెంకటేష్ మధిర

Published: Thursday July 28, 2022
రూరల్ జూలై 27 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడుమల్లవరం గ్రామపంచాయతీ నందు సర్పంచ్ మందడపు ఉపేంద్రరావు  ఆధ్వర్యంలో మాటూరుపేట పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్  వైద్య శిబిరము ఏర్పాటు చేసి నారు. శిబిరం నందు ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ పరీక్షలు చేసి తగిన మందులను ఇవ్వటం జరిగినది అలానే సీజనల్ జ్వరంతో బాధపడుతున్న వారికి కూడా రక్త పరీక్షలు, తగిన జాగ్రత్తలు సీజనల్ వ్యాధులపై ఆరోగ్య అవగాహన డివాటరింగ్ పై ఆరోగ్య అవగాహన గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించి నార్మల్ కాన్పు కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు సకాలంలో హాస్పటల్కి తీసుకొని వెళ్లే జాగ్రత్తలపై ఆరోగ్య అవగాహన కల్పించడం జరిగినది ఈ సందర్భంగా వైద్యాధికారి గారు మాట్లాడుతూ ప్రజలంతా పరిశుభ్రత పాటిస్తూ కాచి చల్లార్చిన నీరు తాగుతూ వర్షపు నీటిని ఎప్పటికప్పుడు డివాటరింగ్ చేయవలెనని తద్వారా దోమలను డెంగు జ్వరాలు నివారించవచ్చని తెలియపరిచారు. ఈ శిబిరం నందు ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు భాస్కరరావు, శరత్ బాబు ,సుభాషిని, మరియరాణి లక్ష్మీనారాయణ మహిళా ఆరోగ్య కార్యకర్త సుజాత, ఆశా కార్యకర్తలు నాగమణి ,ఝాన్సీ, సుజాత , గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం.
వంట వారికి టైఫాయిడ్ పరీక్షలు               కలెక్టర్  ఆదేశం ప్రకారం ఈరోజు మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్  ఆధ్వర్యంలో పీహెచ్సీ నందు ఈరోజు ప్రభుత్వ హాస్టల్స్ పాఠశాలలు అంగన్వాడీ ఆయాలు కు ఈరోజు టైఫాయిడ్ వైడాల్టెస్టుకు శాంపిల్స్ తీసుకోవడం జరిగినది... ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరము అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు, తాగునీటి కలుషితం ద్వారా టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంది.. కావున ఇంటిలోని వేడివేడి ఆహార పదార్థాలు భుజించుట, కాచి చల్లార్చిన నీళ్లు తాగుట, వీధుల వెంబటి ఆహార పదార్థాలు తినకుండా ఉండటం వల్ల టైఫాయిడ్ ని మనం నివారించవచ్చని వైద్యాధికారి గారు తెలియపరిచారు... ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు భాస్కర్ రావు, శరత్ బాబు, సుభాషిని,మరియా రాణి ల్యాబ్ టెక్నీషియన్ పుతీలి భాయ్, స్టాఫ్ నర్స్ మార్తమ్మ ,శిరోమణి పాల్గొని వంట వారికి ఆరోగ్య అవగాహన కల్పించినారు..