రెబ్బెన ప్రెస్ క్లబ్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి ** "రెబ్బెన లో అంతర్రాష్ట్ర రహదారి పై" జ

Published: Wednesday September 14, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 13 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని రెబ్బెన ప్రెస్ క్లబ్ కూల్చిన దుండగుల పై ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని వెంటనే వారిని అరెస్టు చేయాలని, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, టీయూడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా కన్వీనర్ రవి నాయక్, టీయూడబ్ల్యూజే ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ లు డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారి పై జర్నలిస్టులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కూల్చిన దుండగులను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం ఎంత వరకు సమంజస మని అన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు, పోలీసులు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. ప్రెస్ క్లబ్ కూల్చడం జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ కూల్చిన దుండగులు ఎంతటి వారైనా వెంటనే వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి  సీఐ నరేందర్, ఎస్సై భూమేష్  చేరుకొని ఆందోళన విరమించాలని చెప్పిన, తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని, ఇప్పటివరకు దుండగులను ఎందుకు అరెస్టు చేయలేదని, కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని, పోలీస్ అధికారులతో జర్నలిస్టు సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. 3,4, రోజులలో కూల్చిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీఐ నరేందర్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జర్నలిస్ట్ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, టీయూడబ్ల్యూజే ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మహేష్, రాజశేఖర్, సతీష్, జర్నలిస్టులు సురేష్ చారి, హన్నన్, కృష్ణ మోహన్ గౌడ్, రాందాస్, రెబ్బెన మండల జర్నలిస్టులు  తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area