పల్లె దవఖానలో ఒప్పంద ఉద్యోగాల జాబితా

Published: Thursday September 29, 2022
జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజా పాలన : పల్లె దవఖానలో పనిచేయుటకు ఒప్పంద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపిక జాబితాను ఆన్లైన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నదని జిల్లా వైద్యాధికారి పాల్వల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని వైద్య  ఆరోగ్య శాఖలోని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్  (ఎం.ఎల్.హెచ్.పి) పల్లె దవఖాన లో  జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుటకు అర్హులైన ఎంబిబిఎస్, బిఏఎంఎస్, నర్సింగ్ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను స్వకరించడం జరిగిందని, అట్టి దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్ ను  జిల్లా  వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో vikarabad.telangana.gov.in వెబ్ - సైట్ లో  పొందుపర్చడం జరిగిందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పాల్వన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  అభ్యర్థులు ఇట్టి లిస్ట్ ను పరిశీలించుకొని ఈనెల 29 నుండి 30 వరకు  ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వారు నేరుగా కార్యాలయంలో సంప్రదించగలరని వారు కోరారు.