సేంద్రియ వరి సాగు పై విద్యార్థులకు క్షేత్ర పరిశీలన

Published: Friday October 01, 2021
మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం తొర్లపాడు గ్రామానికి చెందిన కుడుముల వెంకటరామిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు విధానం పై గురువారం రోజున డాక్టర్ ఎస్ శ్రీనివాస రావు, డాక్టర్ శ్రీమతి కె నాగజ్యోతి, డాక్టర్ జి వేణుగోపాల్ సేంద్రీయ పధ్ధతి విత్తనం ఎంపిక, సాగు విధానం బీజామృతం, జీవామృతం, ణ జీవామృతం, అమృత ద్రావణం, జీవన ఎరువుల తయారీ పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు సేంద్రీయ సాగు రైతు కుడుముల వెంకటరామిరెడ్డి సేంద్రీయ కెమికల్ వ్యవసాయం గల సాగు విధానం, సేంద్రీయ వ్యవసాయం వల్ల ఉపయోగాలు కెమికల్ వ్యవసాయం వల్ల భూమి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న విధానంపై విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో సేంద్రియ సాగు రైతు సురేందర్ రెడ్డి, దేశవాలి గో సంరక్షకుడు మురళి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ఈ వ్యవసాయ క్షేత్రంలో రకమైన నవారు బహురూపి, కుంకుమపువ్వు, కాల బట్టి,  మైసూర్ మల్లికా, గోస్ రకాలను సాగు చేస్తున్నారు