తొలిమెట్టు శిక్షణ ను పరీశీలించిన సెక్టోరియల్ అధికారి

Published: Tuesday August 02, 2022

కొడిమ్యాల, ఆగస్టు 01 (ప్రజాపాలన ప్రతినిధి) :

కొడిమ్యాల మండల వనరుల కేంద్రం లో తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా సెక్టోరియల్ అధికారి ఎండి. అబ్దుల్ అజీం సోమవారం పరిశీలించారు. ఆర్ పి లు తొలిమెట్టు పై ఉపాధ్యాయులకు వివరిస్తున్న విధానాన్ని సుమారుగా ఒక గంటన్నర పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సెక్టోరియల్ అధికారి ఎండి.అబ్దుల్ అజీం మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుండి ప్రారంభించుకుంటున్నామని పాఠశాల విద్య పూర్తి అయ్యేసరికి విద్యార్థులందరూ ఆయా సబ్జెక్ట్ లలో నిర్దేశించిన సామర్ధ్యాలు సాధించాలని ,తొలిమెట్టు కార్యక్రమానికి చెందిన వివిధ విషయాల రిపోర్ట్స్ సకాలంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పంపించి.కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధి కారి ద్వారా జిల్లాకు కు పంపాల్సి ఉంటుందన్నారు. కరోనా సంక్షోభంలో విద్యార్థుల కు జరిగిన నష్టాన్ని తొలిమెట్టు కార్యక్రమం ద్వారా భర్తీ చేయవచ్చు అన్న అభిప్రాయం తెలిపారు .అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో కాంపెక్స్ ప్రధానోపాధ్యాయులు నాంపెల్లి మల్లేశం,సాయని ఐలయ్య,ఆర్కాల శ్రీనివాస్ ఆర్.పి లు అరేటి. వెంకటేశ్వర్లు, ముమ్మాడి. హరికృష్ణ కొండూరి. సతీష్ ,విలాసాగరం. సంతోష్ సీఆర్పీలు వొడ్నల సాయి ,తులసి పాల్గొన్నారు.