పొలాల్లో వరి కోయ్యలను కాల్చవద్దు భూసారం తగ్గే ప్రమాదం ఉంది - ఏవో అనూష

Published: Tuesday May 25, 2021
బీరుపూర్/సారంగాపూర్, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ సారంగాపూర్ మండలాల్లో రైతులు కోసిన పంట పొలాల్లో వరికొయ్యలకు అగ్గితో తగలబెట్టి కాల్చడంతో భూసారం పూర్తిగా తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారిణి జె.అనూష రైతులకు తెలియజేశారు. ఎకరాకు 10 నుండి 12 కిలోలు పచ్చిరొట్ట విత్తనాలను జనుము జీలుగ పిల్లిపేసరు ఆలసంద దుక్కిదున్ని చల్లుకోవలని మరియు 45 రోజుల్లో దుక్కి దున్నాలని తెలిపారు. పచ్చిరొట్ట మురగడానికి సరిపడు తేమ ఉండాలని మురిగిన 7 రోజుల వ్యవధిలో వరినాట్లు వేయాలని అనూష రైతులకు సూచించారు.