7న ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చేయండి. -ప్రైవేట్ కళాశాలల అధిక ఫీజుల అరికట్టాలి. -పి డి స్ యూ

Published: Wednesday December 07, 2022
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిసెంబర్ 7 న జరుగు ప్రగతి భవన్ ముట్టడినీ జయప్రదం చేయాలని, పి డి ఎస్ యు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి,రాజేష్, అన్నారు.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు పాటించని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను రద్దు చేయాలని, శ్రీ చైతన్య నారాయణ తదితర కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలనీ, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, దుర్మార్గమైన నూతన జాతీయ విద్యా విధానం రద్దుకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలని, పెంచిన బస్సు చార్జీలను తగ్గించి పాత పద్ధతిని అమలు చేయాలని, విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని కోరుతూ ప్రగతి భవన్ ముట్టడి చేయడం జరుగుతుంది. విద్యార్దులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు అన్నారు  ఈ కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి, కోజ్జంకి జైపాల్, బొజ్జి శ్రీకాంత్. అశోక్, లింగం, ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.