మట్టి తరలింపు ను అడ్డుకున్న గ్రామస్తులు.

Published: Saturday November 05, 2022
పాలేరు నవంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలంలోని చెరువుమాధారం నుంచి జాతీయ రహదారి నిర్మాణ
పనులకు తొలుతున్న మట్టిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ
నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా తొలుతున్నారని
ఆరోపించారు. గ్రామ అవసరాల కోసం మట్టి లేకుండా..కొంత మంది
స్వార్ధంతో మట్టిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం క్వారీ వద్ద
నిరసన చేపట్టారు. యంత్రాలు ఆపి అక్కడ నుంచి బయటకు వచ్చే
వరకు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు సదరు కాంట్రాక్టర్ యంత్రాలు:
టిప్పర్ల ను క్వారీ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా.
సర్పంచ్ ఈవూరి సుజాత. ఉప సర్పంచ్ ఆకుల వెంకటేశ్వర్లు లు,
మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించి మట్టిని తొలుతున్నారని.
ఆరోపించారు. కొంత మంది అధికారులు తమను బెదరిస్తున్నారని.
ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం మట్టిని తరలించేందుకు
చేయబడునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పలురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు