జిల్లాలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు...

Published: Thursday July 08, 2021
జగిత్యాల, జులై 07 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తా గాంధీనగర్ జిల్లాలోని వివిధ మండలాలు గ్రామాల్లో దండోరా ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాలను ఎగరేసి ఏబీసిడి వర్గీకరణ చేపట్టాలని నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యమం 1994 నుండి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా ఇడుముడి నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు వర్గీకరణలో భాగంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు. మాదిగల ఆత్మగౌరం కోసం నిరంతరం పోరాడే వ్యక్తి మందకృష్ణ మాదిగ అని మాదిగలకు పెద్దదిక్కు మందకృష్ణ మాదిగనే అని కోనియాడారు. మాదిగ మాదిగ ఉపకులాలు విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో సమాన అవకాశాలు రావాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం మాదిగ బాలే శంకర్ మాదిగ నక్క జీవన్ మాదిగ సారంగాపూర్ బీరుపూర్ కన్వీనర్లు బెజ్జంకి సతీష్ మాదిగ బదినపల్లి శంకర్ మాదిగ పడిగెల మల్లయ్య మాదిగ బొల్లారపు దివాకర్ గిరిధర్ నక్క సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.