రోజులు గడుస్తున్నా అందని పరిహారం

Published: Monday August 01, 2022
వరదలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు నష్టపరిహారం  ఇవ్వాలి.
 
- పి. ఆశన్న సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్
 
మంచిర్యాల టౌన్, జూలై 31, ప్రజాపాలన: భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలో కామ్రేడ్ శేనిగరపు అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన పి. ఆశన్న సిపిఐ(ఎం)  తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ,  రాష్ట్రంలో అతిభారీ వర్షాలు , వరదలు ఎక్కువ రావడంతో  జిల్లాలో జన్నారం నుండి   వేమనపల్లి గోదావరికి ఇరువైపుల ఉన్న గ్రామాలను బ్యాక్ వాటర్ వరదతో ముంచేత్తింది.   జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, రాం నగర్, ఎల్ఐసి కాలనీ , ఇతర కాలనీలు  కూడా వరదలో నీటిలో మునిగిపోయినాయి.ఈ ప్రమాదం నుండి ప్రజలను రక్షించాల్సిన  ప్రభుత్వం. బాధ్యత రహిత్యంగా వ్యవరించిందని. వరదలో సర్వం కోల్పోయిన దాంట్లో బాలాజీ నగర్ కి చెందిన ఒక మహిళా తన ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం విచారకారం అని అన్నారు. ప్రజలు తమ ఇండ్లను కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు.నష్ట పోయిన ప్రజలకు న్యాయం చేయవల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీ,స్థానిక జిల్లా కలెక్టర్ మొక్కుబడిగా సందర్శించారు. నష్ట పోయిన వారి నుండి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇన్ని రోజులు గడిచిన ప్రభుత్వం ఒక్కరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. వెంటనే వరద బాధితులకు ఒక్క లక్ష ఆర్థిక సహాయం చేయాలని డిమండ్ చేశారు. లేని పక్షంలో  సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రామలు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్, అశోక్, దాసరి రాజేశ్వరి, ఎర్మ పున్నం జిల్లా కమిటీ సభ్యులు  దాగం రాజారాం, దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.