ఘంగా చాకలి ఐలమ్మ 127 వ జయంతి

Published: Tuesday September 27, 2022

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 26, ప్రజాపాలన: చాకలి ఐలమ్మ 127 వ జయంతి ని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కు దగ్గర తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షుడు సంగం లక్ష్మణ్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి వెట్టిచాకిరి విముక్తి కోసం దొరల పైన తిరుగుబాటు చేసి విజయం సాధించిన చాకలి ఐలమ్మ ను స్పూర్తిగా తీసుకొని బీసీ ప్రజలు రాజాధికారం  వైపు కదలాలని అన్నారు.   రజకులకు దళిత బంధు లాగ రజక బంధు బంధం అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.   హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పైన ఐలమ్మ విగ్రహం పెట్టాలని కోరారు. మంచిర్యాల జిల్లా  కేంద్రంలో ముఖ్య  కూడలి లో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సంఘపు ఎల్లన్న, జిల్లా   కంచర్ల కొమురయ్య, బీసీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్, పానుగంటి శ్రీనివాస్, బింగి ప్రవీణ్, రాజారామ్, గుమ్ముల శ్రీనివాస్, వడ్డేపల్లి మనోహర్ కొత్తపల్లి రమేష్, రాస మల్ల కుమార్, లింగన్నపేట విజయ్ తదితరులు పాల్గొన్నారు.