*అయ్యప్ప స్వామి ఆలయంలో15 మండల పూజలు

Published: Wednesday December 28, 2022

మధిర రూరల్  డిసెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి ప్రతిని) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మంగళవారం జరిగిన ఉదయాస్తమాన పూజల్లో చలవాది శ్రీనివాసరావు  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి ముగింపు 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం భక్తులకు అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చలవాది శ్రీనివాసరావు కుటుంబ సభ్యులుమాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం సహకారంతో ఏర్పాటు చేయడం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ 15 మండల పూజలు భాగంగా 63 రోజులు సివేలి పూజలు ఉదయాస్తాం అన్నదానం పడిపూజ భజన భక్తమండలి ప్రతి బుధవారం స్వామి సేవ చేసేవారు అందరికీ స్వామి అయ్యప్ప దేవాలయం అన్ని ప్రాంతాలు ప్రజలు నుండి సహకరించిన భక్తులు సేవా అయ్యప్పలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ వారికి సేవ చేసిన కారణంగా వారికి గుర్తింపుగా స్వామి అయ్యప్ప దేవాలయంలో మండల పూజలో సేవ పురస్కారం అందించటం జరిగిందని వారు తెలిపారు మండల పూజలో భాగంగా 63 రోజులు బియ్యం సమకూర్చినదాత దివ్య శిరిడి సాయిబాబా దేవాలయం అధినేత పబ్బతి వెంకట సుబ్బారావు కుమారుడు రవికుమార్ వారికి అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో గురుస్వామి దేవిశెట్టి రంగారావు పుల్లారావు నాగభూషణం సుబ్బారావు రమేష్ గాంధీ శ్రీనివాస్ కాశి వంకరపాటి నాగేశ్వరావు బాబు మేడం వెంకటేశ్వర రావు మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, గాంధీ స్వామి ఎంఆర్సి రావు బత్తుల శీను శ్రీధర్ వెంకట్రామ సామ్రాజ్యం శ్రీనివాస్ ఆంజనేయులు సూర్యనారాయణ దుర్గారావు రాజు వెంకటేశ్వర్లు పుణ్యవతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అయ్యప్ప భక్తులు మహిళలు స్వామి తదితరులు పాల్గొన్నారు.