తొమ్మిదో రోజు దీక్షకు సీపీఎం నాయకులు సంఘీభావం

Published: Friday March 03, 2023
కల్లూరు, మార్చి 2 (ప్రజాపాలన న్యూస్):
 
 కల్లూరు డబుల్ బెడ్ రూమ్ ల లాటరీ విధానంలో అవకతవకలు జరిగాయని గత తొమ్మిది రోజుల నుండి మహిళలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. గురువారం కల్లూరులో జరుగుతున్న దీక్షలకు సీపీఎం పార్టీ నాయకులు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల సమస్యలు పరిష్కారంలో ఘోరంగా విఫలం చెందారన్నారు. కల్లూరులో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతుంటే ఎమ్మెల్యే వాటిని పట్టించుకోకుండా వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్యేకు తొత్తులుగా ఉన్న వారికే అందిస్తున్నారని మిగతా వారిని పట్టించుకోవటం లేదన్నారు. ప్రత్యేక కాకుండా కల్లూరులో భూములను కూడా నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కృష్ణార్జును రావు, కృష్ణవేణి,  తన్నీరు వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.