*బి సి సబ్ ప్లాన్ ఏర్పాటు పై మాట తప్పిన కే సి ఆర్*

Published: Wednesday August 24, 2022
 - గుమ్ముల శ్రీనివాస్ బి సి సంఘం అధ్యక్షుడు 
 
మంచిర్యాల టౌన్, ఆగష్టు 23, ప్రజాపాలన: బి సి సబ్ ప్లాన్ ఏర్పాటు పై మాట తప్పిన కే సి ఆర్ 2017 మార్చి బడ్జెట్ సమావేశంలో నిండు సభలో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసేలా చట్టం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఆరు సంవత్సరాల అవుతున్న బి సి సబ్ ప్లాన్  పై అడుగు ముందుకు వేయకపోవడం తో  సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని  మంగళవారం రోజున  మంచిర్యాల ఐక్య బి సి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ గాంధీ విగ్రానికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి సి సంఘాలు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు  చేస్తున్నప్పటికి,  న్యాయమైన డిమాండ్ ను పరిష్కారించడం లో తెరాస ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందననీ రాష్ట్ర జానాభలో 56 శాతం వున్న బి సి లే ఈ ప్రభుత్వానికి వివిధ రూపాలలో అత్యధిక పన్నులు కడుతున్నారు. రాష్ట్ర ఖజానాల్లో 80 శాతం ఖజాన  అయినప్పటికీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో బి సి  లకు జనాభా  ప్రతిపాదికన బడ్జెట్ కేటాయించాలని, బి సి సబ్ ప్లాన్ ఏర్పాటు పై ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బి సి సంఘాల ఐక్యవేదికగా    డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో నిర్వహస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో  
బి సి సంఘాల ఐక్యవేదిక నాయకులు  లక్ష్మణ్, కొత్తపల్లి రమేష్, లక్ష్మణ్, రాసమల్ల కుమార్, జక్కం రవీందర్ ,మిట్టపల్లి రాజన్న, భీమ తిరుపతి, మగ్గిడి రాజశేఖర్, జైపాల్ సింగ్, నార్ల మహేందర్, కనకరాజు, జంబోజి శ్రీనివాస్,  నిజాం, శంకర్, తదితరులు పాల్గొన్నారు.