కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రూపును కొనసాగించాలి

Published: Wednesday September 28, 2022
మధిర రూరల్ సెప్టెంబర్ 27 ప్రజాపాల ప్రతినిధి  మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద మధ్య తరగతి విద్యార్ధులకు అందుబాటులో వున్న వృత్తిపరమైన కోర్సును తొలగించటం మంచిది కాదని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడుపల్లి లక్ష్మణ్ ఇటుకల రామకృష్ణ  పేర్కొన్నారు. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని కోర్సులు తొలగించాలని అధికారులు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ గౌతమ్ కు వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఎస్ఈ కోర్సును ఎత్తివేయటం వల్ల పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. ఈ కోర్స్ ఎత్తివేయటం  వల్ల 40 మంది విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని, తక్షణమే ఎత్తివేసే ఆలోచనలు విరమించుకోవాలన్నారు. అదేవిధంగా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డైరీ గ్రూప్ ని ఏర్పాటు చేయాలని ఈ కోర్సు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో డైరీ గ్రూపు ఏర్పాటు చేయడం వల్ల జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని, ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని, జూనియర్ కళాశాలలో అటెండర్, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి యువరాజు జిల్లా నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.