జిల్లా పరిషత్ బాలుర సెకండరీ పాఠశాలలో కళా ఉత్సవము కార్యక్రమం

Published: Saturday November 19, 2022

జన్నారం, నవంబర్ 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర సెకండరీ పాఠశాలలో శుక్రవారం కళా-ఉత్సవము కార్యక్రమములో భాగంగా జన్నారం మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దన్, కిష్టపూర్ ప్రధానో పాధ్యాయులు మురళి మాట్లాడుతూ మండలంలోని వివిధ పాఠశాలల్లో 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థిలు కళా ఉత్సవము కార్యక్రమంలో   నాట్య పోటీలలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ నాట్య పోటీల్లో గెలుపొందిన వారికి మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు వారి చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను బహుకరించడం జరిగిందని అన్నారు. ఈ కళా ఉత్సవ కార్యక్రమం న్యాయ నిర్దేతలుగా చందులాల్, తుంగూరి గోపాల్, మంజుల, వ్యవహరించారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుతున్న పిల్లలలో దాగి ఉన్న కళలను ప్రోత్సహించాలని ప్రభుత్వము ఈ పోటీలు నిర్వహిస్తోందిని, ఇక్కడ ప్రథమ స్థానంలో వచ్చిన వారు జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని, అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.