తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచేది తల్లిపాలు ఒకటే ఆళ్ళ పాడు అంగన్వాడి కేంద్రాల్లో తల్లి

Published: Tuesday August 02, 2022
బోనకల్, ఆగస్టు 01 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్ళ పాడు గ్రామ అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆద్యతన నిర్వహించడం జరిగింది. అంగన్వాడి సూపర్వైజర్‌ బీజాన్బీ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్న పిల్లలకు వారికి వచ్చేటువంటి పోషక పదార్థాలు తీసుకొని అమ్మపాలు ఎంతో మేలు సేకరిస్తాయని మొదటి ఆరు నెలల తల్లిపాలు శ్రేయస్కారము తల్లిపాల కంటే శ్రేష్టమైనవి ఈ సృష్టిలో ఏవీ లేవని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు అందించడం తప్పనిసరి తల్లిపాలు అందించడంతో భవిష్యత్తులో ఆ పిల్లలకు డయాబెటిస్ ఒబేసిటీ లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయని, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చిన్న పిల్లలు వైరస్ బ్యాక్టీరియాతో పోరాడగలిగే రోగనిరోధక శక్తి పొందగలుగుతారు. సోమవారం నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యే తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తల్లిపాలతో బిడ్డకు ప్రయోజనాలు తల్లిపాలతో బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో ఉన్న పోషకాలు విశిష్టతను ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని, పిల్లలకు తల్లిపాల కంటే శ్రేష్టకరమైనవి ఏవి లేవనిఈ విషయాలను తల్లులు గ్రహించాలిని, ఏడాది పిల్లల వరకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. తల్లి బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంచేది తల్లిపాలు ఒక్కటేనని, బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి ఆ తర్వాత మరో సంవత్సరం పాటు పట్టిస్తే మంచిదని, కూరగాయలు పండ్లు పప్పు ధాన్యాలు ప్రోటీన్స్ వంటివి పిల్లలకు చాలా మంచిది వాటితోపాటు తల్లిపాలు శిశువుకు సమతుల్యం పోషకాలు అందిస్తాయి కావలసిన విటమిన్స్ ప్రోటాన్సు ఫ్యాటు వంటివి తల్లిపాల వల్లే పిల్లలకు లభిస్తాయని తెలియజేశారు. వ్యాధి తల్లిపాలు వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తాయని, ప్రతి సంవత్సరం ఆగస్టు నెల నుంచి మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రం లో నిర్వహించడం తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించి రక్షించుకోవడానికి ముందుచూపుతోనే చేపట్టాలని, శిశువు పుట్టిన వెంటనే గంటలోపే తల్లి రోమ్ము అందించి మురిపాలు తప్పనిసరిగా పట్టించాలని కోరారు. అనంతరం బాలింతలకు గుడ్లు, బాల అమ్రుతం పాకేట్లు సర్పంచ్ మర్రి తిరుపతిరావు చేతులమీదుగా అందజేశారు. అనంతరం తల్లిపాల వారోత్సవం సందర్భంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, హుస్సేన్ బీ ,గౌరమ్మ, ఆశా కార్యకర్త రత్న కుమారి, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.