విద్యుత్ కంట్రోల్ రూం ఏర్పాటు : జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్

Published: Thursday July 15, 2021
వికారాబాద్ జూలై 14 ప్రజాపాలన బ్యూరో : జిల్లాలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 9493193177 కు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  కాల్ చేసిన వెంటనే విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు.