పీజీ ఎంట్రెన్స్-2022 అత్యున్నత ర్యాంకులు --విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ డా. వై సత్యన

Published: Thursday September 29, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): పీజీ ఎంట్రన్స్- 2022, బి.ఎడ్ ఎంట్రన్స్  లలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ అభినందించారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టులలో మంచి ర్యాంకులు సాధించిన  స్ఫూర్తి 27వ ర్యాంకు,  కావ్య 123 వ ర్యాంకు, నవ్య,  గౌతమి, రాజశ్రీ, లిఖిత  తదితర విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందించారు. వివిధ సబ్జెక్టుల్లో ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం విద్యార్థులను ఉన్నత విద్యలో అందించడానికి తోడ్పడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు. జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, రాజనీతి శాస్త్రం, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము. ఎకనామిక్స్, కామర్స్ , గణిత శాస్త్రము, తెలుగు,  ఆంగ్లము, ఉర్దూ వివిధ సబ్జెక్టుల అత్యున్నత ర్యాంకును సాధించారు. ఈ కార్యక్రమం లో  వైస్ ప్రిన్సిపల్ డా. మసురూర్ సుల్తానా, స్టార్ క్లబ్ సెక్రటరీ డా. ఎం సత్య ప్రకాష్, వాణిజ్యశాస్త్రం విభాగాధిపతి ఎం శ్రీనివాస్ రెడ్డి, జంతుశాస్త్ర విభాగాధిపతి డా. ఏ జ్యోతి లక్ష్మి,  ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు డా. హరి జ్యోతికౌరు, డా. కే కిరణ్ మై, ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారి డా. పడాల తిరుపతి డా. జి చంద్రయ్య, అకాడమికోఆర్డినేటర్  శంకరయ్య, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ స్వరూప రాణి, జిజ్ఞాస కోఆర్డినేటర్ జి మానస, రాపర్తి శ్రీనివాస్, నవీన్, గొల్లపల్లి తిరుపతి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.