కలెక్టరేట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Friday January 20, 2023

ఆసిఫాబాద్ జిల్లా జనవరి 19 (ప్రజాపాలన, ) :ప్రజకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాలలో భాగంగా పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ సముదాయ పనులను రోడ్లు భవనాల శాఖ ఈ.ఈ. పెద్దన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు అందుతాయని తెలిపారు. పనుల నిమిత్తం కలెక్టరేట్ భవనానికి వచ్చిన ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే విధంగా భవన ఆవరణలో పూలు, పండ్ల మొక్కలను నాటి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.భవనంలోని అన్నిగదులకు త్రాగునీరు అందే విధంగా పైపులైన్లు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.